పెళ్లిపై రాహుల్ స్పందన
44 సంవత్సరాలు. ఇంకా పెళ్లికాని నవ యవ్వన బ్రహ్మచారే. ఎంతో మంది యువతుల గుండెల్లో చోటు సంపాదించినవాడు అతడే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ. అదేమో గానీ, మీడియా పెళ్లి గురించి అడిగినప్పుడల్లా రాహుల్ మౌనమే సమాధానమంటారు. ఈ సారి కూడా మీడియా వేసిన అదే ప్రశ్నపై యథావిధిగా రాహుల్ తన అయిష్టాన్ని వ్యక్తపరిచారు.
''నా పెళ్లి ఎప్పుడు? ప్రధాని పదవిని నేనెప్పుడు చేపడతా? ఇవి ఇప్పుడు అవసరం లేని ప్రశ్నలు. దేశ ప్రజలు తమకు ఏం కావాలో చెప్పుకునేందుకు వారికి తగిన గొంతుకను ఎలా ఇవ్వాలన్నదే అవసరం. అదే ఆలోచిస్తున్నా'' అని రాహుల్ బదులిచ్చారు.